పసుపు నీటితో శుద్ధి చేసి, దళిత జాతిని అవమానించారు మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం దళితులు కేసిఆర్ ఫామ్ హౌస్ కు దగ్గరకు వచ్చారని బీఆర్ఎసచ శ్రేణులు పసుపు నీటితో శుద్ధిచేసి దళిత జాతిని అవమాన పరిచారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎం ఎల్ సి లు చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా మండల కాంగ్రెస్ నాయకులు శనివారం మండలకేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి, నిరసన తెలిపారు. అదే విధంగా కేసీఆర్ దిష్టిబొమ్మ ను దగ్ధం చేసి, ర్యాలీగా చేస్తూ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ…నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరు కావడం సహజమే అయినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఉండడంతో నిబంధనలు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎం ఎల్ సి లు హంగామా సృష్టించి, మహిళా కానిస్టేబుల్స్ ను అసభ్యంగా తాకడం, పోలీసులపై దాడి చేయడం, అర్థనగ్న ప్రదర్శన చేయడం, దళితుడైన స్పీకర్ ను చెప్పరాని భాషతో దూషించారని గుర్తు చేశారు. ఆగ్రహించిన దళితులు కేసీఆర్ ఫాం హౌస్ వద్ద డప్పు కొట్టి నిరసన తెలిపితే, దళితులు రావడంతో మైల పడిందనే దొర అహంకారంతో పసుపు నీటితో శుద్ధి చేసి దళిత జాతిని ఘోరంగా అవమానించారని ఆవేదన చెందారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ నాయకులు అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, జరిగిన ఘనటనలపై బేషరతుగా క్షమాపణ చెప్పకుండా, సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడం అహంకారానికి నిదర్శనమన్నారు. కేటీఆర్ సైతం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని చెప్పరాని భాషతో దూషించాడని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనలకు పూర్తి భాద్యుడు కేసీఆర్ అని, అసెంబ్లీ కి వచ్చి తెలంగాణ దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సూచనలివ్వడం మానుకుని ఘర్షణ వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయ అలజడి రేపాలని చూస్తున్నారని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవంతో అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ సైనికులు ఓపికతో చూస్తున్నామని, రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై పార్టీలు, కులాలకు అతీతంగా సమాజమంతా ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు చల్లా చక్రపాణి, మారపల్లి రవీందర్, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, వైనాల కుమారస్వామి, నిమ్మల రమేష్, మారపల్లి కట్టయ్య, చింతల రవిపాల్, హైదర్, ఏరుకొండ శంకర్, కొమ్ముల భాస్కర్ సర్పంచులు ఐలయ్య, సదర్ లాల్, సతీష్,శివాజీ, సరోజన, మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..