జీఓ నం.97ను రద్దు కోరుతూనాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉద్యోగుల వంటావార్పు
జనం న్యూస్- సెప్టెంబర్11- నాగార్జునసాగర్ టౌన్- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభావితం చేసే జీఓ నం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.నిరసనలో భాగంగా శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, జీఓ నం.97 వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, విద్యార్థులు మరియు ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఓ నం.97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఉద్యోగులు పాల్గొని జీఓ నం.97కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.