నియోజకవర్గ(MPTC) జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాపరిశీలన కొరకు ప్రజ ప్రతినిదులతోసమావేశంఎంపీడీవో కే ఆర్ ఎం ప్రసాద్.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 11. నందలూరుమండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలన కొరకు ప్రజా ప్రతినిధులతో ఎంపీడీవో అధ్యక్షతన సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగాఎంపీడీవో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాబోయే MPTC/ZPTC ఎన్నికల నిమిత్తం ఓటర్ల జాబితాను ఎంపీడీవోకార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆయా గ్రామపంచాయతీ కార్యా లయాల నోటీసు బోర్డులపై ప్రజల పరిశీలనార్థం ఉంచినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సభకు వివరించారు.ఈకార్యక్రమంలో మండల పరి షత్ అభివృద్ధి అధికారి కే.ఆర్. ఎం .ప్రసాద్, డిప్యూటీ ఎంపీ డీవో మాల్యద్రి,ఏ ఓ హాబీబుల్లా ఖాన్,ప్రధాన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.