ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహణ

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహణ

జనం న్యూస్ సెప్టెంబర్ 17/ 9l 2026 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొప్పిగుంట గ్రామం రావులచెరువు వద్ద 104 క్యాంపులో నిర్వహించారు. ఈ కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థూలకాయం, క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం, మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యాధికారి బి.రోజా వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వనచర్ల నాగేశ్వరరావు, బొక్కా సత్యనారాయణ, కొప్పిశెట్టి ఏడుకొండలు, సూపర్వైజర్లు క్రాంతికుమార్, వైడూర్యం, ఎంఎల్ హెచ్ పి, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, పల్లంకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇ-పేపర్