జనం న్యూస్ సెప్టెంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిశేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్లో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.ఈ సందర్భంగా రోజా దేవి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్న కాలనీ ప్రజలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులను ప్రశంసించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, మండపాల నిర్వాహకులు, భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.