జనం న్యూస్ సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ విద్యార్థులందరూ ప్రస్తుత చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా కాటేనికొన ఎస్ ఐ వి సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. శనివారం స్థానిక సిద్ధార్థ డిగ్రీ కళాశాల నందు మహిళా సంరక్షణపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థునులు సోషల్ మీడియా వాడకం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, శక్తి యాప్ డౌన్లోడ్ దాని ఉపయోగాల గురించి, ఫోక్సో చట్టం గురించి, మైనర్ గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగర్త లు తెలియజేశారు. తల్లిదండ్రులను సమాజంలోని పెద్దలను గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు అనంతరం విద్యార్థునుల మొబైల్ ఫోన్ లలో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేయించారు. ఈ కార్యక్రమం లో కళాశాల సెక్రటరీ ఎం నాగరాజు, మహిళా కానిస్టేబుల్ లక్ష్మి , కానిస్టేబుల్ లు చిన్నారావు , మహిళా సంరక్షణ కార్యదర్శి టి భాగ్యలత కళాశాల అధ్యాపకులు, కే రవి, ఎం సతీష్, ఏ శ్రీనివాస్, డి హెచ్ వి సత్యనారాయణ, సలోమి, సువర్ణ, అశోక్, కృష్ణ, స్వామి, వెంకటేశ్వర రావు, విద్యార్థి నులు తదితరులు పాల్గొన్నారు