కుండలేశ్వరుని స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు

May 23, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 20 పాయింట్స్ ప్రోగ్రాం చైర్‌పర్సన్ లంకా దినకర్ శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం కుండలేశ్వర గ్రామంలో శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే క్షేత్రపాలకులు వేణుగోపాలస్వామి ఆలయం లో దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి, వారికి దేవస్థానం ఈవో దుర్గ భవాని శ్రీ స్వామివారి చిత్రప టాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ సీనియర్ నాయకులు మోకా వెంకటసుబ్బారావు , బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్ గోకర కొండ సత్తిబాబు , మోటిపల్లి శీను , గంగు మల్ల భద్రరావు గంగుమళ్ల బాబ్జి బీర్ అంబేద్కర్ చిక్కల అంజి అరిగల రామారావు ,చెరుకు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper