మహానాడు కార్యక్రమాలు విజయవంతం చేయండి – జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి

May 25, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ మే 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు-2026’ పండుగ కార్యక్రమాలను విజయవంతం చేయాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పిలుపునిచ్చారు. ​రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28వ తేదీలలో మహానాడు మహోత్సవాన్ని హైబ్రిడ్ పద్ధతిలో, క్లస్టర్ల వారీగా నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ​సమన్వయంతో ముందుకు..​నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్‌ఛార్జ్‌లు, కో-కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షుల పర్యవేక్షణలో.. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. పార్టీ శ్రేణులన్నీ ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన కోరారు. ​”తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడులో జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి.” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పిలుపునిచ్చారు.*

🌐 Select Language:
📰 ePaper