ఆంధ్రప్రదేశ్

హనుమాన్ నగర్ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీకి సొంత నిధులతో ఫ్యాన్లు అందజేత

హనుమాన్ నగర్ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీకి సొంత నిధులతో ఫ్యాన్లు అందజేత

జనం న్యూస్ సెప్టెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి హనుమాన్ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. అశ్వంత్ కుమార్ స్పందించారు. వెంటనే తన సొంత నిధులతో ఫ్యాన్లను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వి. అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ. హనుమాన్ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు లేక సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వేసవి, ఉక్కపోత సమయంలో ఫ్యాన్లు లేకపోవడం వల్ల సిబ్బందితో పాటు చిన్నారులు, ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా తన సొంత నిధులతో ఫ్యాన్లను అందించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆయన కోరారు. ప్రజలకు ఉపయోగపడే చిన్నపాటి అవసరాలను తీర్చడం కూడా సామాజిక బాధ్యతలో భాగమేనని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొని వి. అశ్వంత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్