ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌ పంపిణీ చేసిన ఎం ఈ ఓ బిక్షపతి

విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌ పంపిణీ చేసిన ఎం ఈ ఓ బిక్షపతి

జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మండల విద్యాధికారి జి. భిక్షపతి అన్నారు. బుధవారం శాయంపేట ప్రాథమిక పాఠశాలలో మేరుగు కమలాకర్‌ (యూఎస్‌ఏ) 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 75 మంది విద్యార్థులకు ఎగ్జామ్‌ ప్యాడ్స్‌ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంఈఓ ఎగ్జామ్‌ ప్యాడ్స్‌ను అందజేశారు. విద్యార్థుల చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా వారిని ప్రోత్సహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్ల అశోక్‌రెడ్డి, మేడిపల్లి సురేందర్‌, బి. ప్రవీణ, కే. ఉమా, పి. స్వప్నరాణి, పి. ప్రత్యూషతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

ఇ-పేపర్