ఆంధ్రప్రదేశ్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన 39 మంది లబ్ధిదారులకు 39,04,524 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పులపాలు చేసినప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్‌ఓసీలను పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని అన్నారు ప్రజా ప్రభుత్వం , రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో ఫణి చంద్ర మండల వ్యవసాయ పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు,, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్