రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
(జనం న్యూస్-మే 13- కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ -) మునగాల మండలం బరాఖతూడెం లో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డా. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మితిమీరిన యూరియా వాడకం వల్ల కలిగే నష్టాల ను వివరించి, పంట మార్పిడి,సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను తెలిపారు. శాస్త్రవేత్తలు వరి,పెసర సాగులో మెళకువలను రైతులకు వివరించారు.