వైద్యుడిపై ఫిర్యాదు.. వైద్యశాఖవిచారణ

May 13, 2026 | వైరల్ వార్తలు

(జనం న్యూస్-మే 13-కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ -) మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పై వచ్చిన ఫిర్యాదులపై సూర్యాపేట జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల కమిటీ విచారణ చేపట్టింది.స్థానిక వైద్యశాల నందు ఎం ఎల్ హెచ్ పి గా పనిచేస్తున్న దివ్య ఫిర్యాదు మేరకు పిఓసి హెచ్ ఐ పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం,డిప్యూటీ డిఎంహెచ్ఓ కోదాడ డాక్టర్ మాధవ్ కుమార్ లు వాగ్మూలం నమోదు చేశారు.విధుల్లో అలసత్వం,అనుచిత ప్రవర్తనను సహించబోమని,విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.విచారణలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper