మై భరత్ ఆధ్వర్యంలో ఘనంగా సాంకేతిక దినోత్సవం
జనం న్యూస్ మే 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; మేరా యువ భరత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (గతంలో నెహ్రు యువ కేంద్రం ), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడాలా మంత్రిత్వ శాఖ అమలాపురం బ్లాక్ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ జాతీయ సాంకేతిక-దినోత్సవ వేడుకలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముమ్మిడివరం మెయిన్ రోడ్డు సమీపంలో చెయ్యరు నందుగల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సాంకేతిక దినోత్సవము ను పురస్కరించు కోని జాతీయ సాంకేతిక దినోత్సవమును ఈ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ డి వి ఎన్ ఎస్ వర్మ ,ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ , సభాద్యక్షులు డా॥ కే . సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిధి కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవిష్యత్ ను ఏర్పరుచుకోవాలని కళాశాల ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ శ్రీ ఎం .వెంకటేశ్వర్వ రావు, విద్యార్థుల కు ఈజీ రైటింగ్ కంపిటేషన్ కండక్ట్ చేసి సర్టిఫికెట్ మూమెంటమ్స్ 1st 2nd 3rd ప్రైజెస్ ఇచ్చారు ఈ కార్య క్రమంలో కళాశాల పాలక వర్గ సభ్యలు, సందీప్, కళాశాల విద్యార్ధి, సంక్షేమ శాఖాధిపతి డా॥ బి అరుణ్ కుమార్ , వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గున్నారు.ఈ కార్యక్రమం జరిపించిన మై భరత్ వాలంటీర్స్ జి బేబీ సరోజినీ, వై అనూష . తదితరులు పాల్గొన్నారు