మందుబాబులకు అడ్డాగా మారిన గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ
జనం న్యూస్ 13 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ రోజురోజుకూ మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాత్రి వేళల్లో బస్టాండ్ పరిసరాల్లో మద్యం సేవించడం సరైన నిఘా లేకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి పర్యవేక్షణ సరిగా లేకపోవడం, భద్రతా సిబ్బంది తగినంతగా కనిపించకపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది. రాత్రి సమయంలో పోలీసులు ఆర్టీసీ అధికారుల కళ్ళుగప్పి బస్సులు నిలబడే స్థానంలో మందు సేవిస్తూ బాటిళ్లు పడేసి వెళుతున్నారు. బస్టాండ్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజల రాకపోకలకు కేంద్రంగా ఉండాల్సిన బస్టాండ్ మద్యం సేవకుల కేంద్రంగా మారడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఆర్టీసీ డిఎం దృష్టి సారించి బస్టాండ్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు