తెలంగాణ

జహీరాబాద్‌లో ఘనంగా రాధాష్టమి ఉత్సవాలు

జహీరాబాద్‌లో ఘనంగా రాధాష్టమి ఉత్సవాలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, సెప్టెంబర్ 19: రాధాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ మందిరంలో శనివారం ఉదయం రాధాష్టమి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాదేవికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం భక్తుల సమక్షంలో ఆరతి నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఆశిష్ కృష్ణ శాస్త్రి మహారాజ్ ఆధ్వర్యంలో రాధాదేవి అభిషేక క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు రాధాదేవి కీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.అనంతరం రాధాదేవికి మహా ఆరతి నిర్వహించారు. ఉత్సవానికి హాజరైన భక్తులు రాధాదేవి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాధాష్టమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాధారాణి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం లో రాం రతన్ సార్డా, గురు లింగప్ప గాదిగే, ఎన్నం రఘు, మల్లికార్జున్, మోహన్ రెడ్డి, కిషోర్ సార్డా, వెంకటేశం గుప్తా, సుదర్శన్ రాజు, వందన సార్డా, సంగీత రెడ్డి, మౌనిక, శ్వేత, అర్చన సార్డా, ఘన్ శ్యామ్ జాజు, నగర సంకీర్తన బృందం, ఏకాదశి భజన మండలి, మహేశ్వరి సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.

ఇ-పేపర్