ఆంధ్రప్రదేశ్

వీర హనుమాన్ వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో

వీర హనుమాన్ వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్. బి వీరేశం జహీరాబాద్ నియోజకవర్గం అల్గోల్ గ్రామంలో భారీగా పాడిన లడ్డు వేలం 24. 09. 2026 *రూ.4,05,555/-*లకు అల్గోల్ గ్రామానికి చెందిన సాయన్నగారి రాజేష్ రెడ్డి గారు లడ్డూను దక్కించుకున్నారు.
వినాయకుడి ఆశీస్సులతో నిర్వహించిన ఈ లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన వేలంలో రాజేష్ రెడ్డి గారు అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రాజేష్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. వినాయకుని కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఇ-పేపర్