అంతర్జాల వేదికగా ప్రజావాణి: 110 కి.మీ ప్రయాణం తప్పించిన జిల్లా కలెక్టర్

August 3, 2026 | తెలంగాణ

మద్నూర్ ఆగస్టు 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మద్నూర్ ప్రజల దూర ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం మండల కేంద్రాలలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించడంతో, అందులో భాగంగా ఈరోజు మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్లు ప్రయాణించి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార, అండే కేలూరు గ్రామాల రైతులు తమ భూ సంబంధిత సమస్యలను, గోజే గావ్ – సోనాల గ్రామాల సర్పంచ్ రోడ్డు సమస్యను నేరుగా కలెక్టర్ కి అంతర్జాల వేదిక ద్వారా విన్నవించారు.రైతులు తమ భూ సమస్యలపై వివరించగా, గోజే గావ్ – సోనాల మధ్య రోడ్డు అధ్వానంగా ఉందని, వర్షాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని సర్పంచ్ వివరించారు.కలెక్టర్ ఆదేశాలు
సమస్యల ను విన్న వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ స్పందించారు. గోజే గావ్ – సోనాల మధ్య తాత్కాలిక మొరం రోడ్డు వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈరోజు సాయంత్రం లోపు పంచాయతీ రాజ్ శాఖ జిల్లా, డివిజన్, మండల అధికారులు పంపాలని ఆదేశించారు.అదేవిధంగా పెద్ద ఎక్లార, అండే కేలూరు రైతుల భూ సమస్యలకు సంబంధించిన ఫైళ్లను వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు.అంతర్జాల వేదిక ద్వారా ప్రజలకు న్యాయం చేకూర్చే ఈ విధానంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లే శ్రమ, ఖర్చు తగ్గుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ ఏం డి ముజీబ్, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, MEO రాములు, PR AE, R&B AE, ఇరిగేషన్ AE, హౌసింగ్ AE, APM, అరుణ్ కుమార్, జగదీష్, నాయబ్ తహశీల్దార్ ఎండీ ఖలీద్, గిర్దావర్ మురళీధర్, కార్యాలయ సిబ్బంది రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper