టి.పి.టి.ఎఫ్ చొరవతో ప్రతిభ కళాశాల చేయూత

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ :3ఆగస్టు సోమవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్: ఇటీవల జులై 11న అకాల మరణం చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు శ్రీ గంగాల పర్షరాములు కుటుంబానికి అండగా నిలవాలనే మానవతా దృక్పథంతో ప్రతిభ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చారి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గంగాల పర్షరాములు పెద్ద కుమార్తె అనుశ్రీ పదో తరగతి పూర్తి చేసిన నేపథ్యంలో, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యను ప్రతిభ జూనియర్ కళాశాలలో పూర్తిగా ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. దాదాపు రూ.50 వేల విలువైన విద్యను ఉచితంగా అందించ నున్నట్లు తెలిపారు. ప్రభాకర్ చారి చేసిన ఈ ప్రకటన ఆయన ఉదార స్వభావానికి నిదర్శనంగా నిలిచింది.అనంతరం పర్షరాములు కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తమ పూర్తి సహకారం ఉంటుందని ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం నిజమైన మానవత్వమని, సమాజంలో పరస్పర సహకారం మరింత బలపడాలని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా టి.పి.టి.ఎఫ్ సిద్ధిపేట జిల్లా కమిటీ ప్రభాకర్ చారిని అభినందించింది.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చారి, టి.పి.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాచం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నవీద్, జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధులు, ప్రచార కార్యదర్శి రాజేష్ తదితర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper