అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి సీఐ సురేష్ బాబు
వెండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో సి ఐ సురేష్ బాబు కు సన్మానం.
జనం న్యూస్, మే 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెటుపల్లి సర్కిల్ పరిధిలో స్వర్ణకారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెటుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ బాబు అన్నారు.ఇటీవల మెటుపల్లి సిఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు ను పట్టణంలోని సిఐ కార్యాలయంలో మెటుపల్లి వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు బిజ్జారపు నవీన్ ఆధ్వర్యంలో సిఐ ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ..స్వర్ణకార దుకాణాలకు అపరిచిత వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలని,అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వెండి బంగారు వర్తక సంఘం కార్యదర్శి తిప్పర్తి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాలిపెళ్ళి నాగరాజు,కోశాధికారి ఐల్లేందుల ఉదయ్,కార్యవర్గ సభ్యులు నాంపల్లి పవన్ కుమార్,తుమ్మనపల్లి మారుతి,ఇల్లేందుల నరేష్,తదితరులు పాల్గొన్నారు.