అర్ డి యస్ పూర్తి అయితే అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం
జనం న్యూస్ 15 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ జులేకల్‌లో భారీ బహిరంగ సభ నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం హెలిప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మాజీ ఎమ్మెల్యే డా ఎస్.ఏ సంపత్ కుమార్ కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం వడ్డేపల్లి మండల కేంద్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపునిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం పర్యటించారు. వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని రైతులకు అంకితంగా నిర్మించిన నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించారుఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో శాంతినగర్‌కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డా.ఎస్.ఏ.సంపత్ కుమార్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు తదుపరి జులేకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జులేకల్, మేడికొండ, పచ్చర్ల, పుల్లూరు ప్రాంతాలకు చెందిన నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్ల శిలాఫలకాలను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రారంభించారు ఈ సబ్‌స్టేషన్లు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ _రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డి యస్ ) పూర్తి అయితే అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే డా ఎస్.ఏ. సంపత్ కుమార్ నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు ఈ పర్యటన సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎంపీ డా మల్లు రవి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ వీర్నపల్లి శంకర్ అనిరుధ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు సరిత తిరుపతయ్య శివసేన రెడ్డి డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గ్రంథాలయ కమిటీ చైర్మన్ నీలి శ్రీను మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, కౌన్సిలర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా నాయకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.