కాట్రేనికోన జెడ్పిటిసి నేల కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

July 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :కాట్రేనికోన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్& పితాని బాలకృష్ణ పాల్గొనిఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కిషోర్ కుమార్‌కు పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ, నేల కిషోర్ కుమార్ ప్రజా సేవలో చూపిస్తున్న చొరవ, నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. యువ నాయకుడిగా పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కిషోర్ కుమార్ నాయకత్వంలో కాట్రేనికోన మండలం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.కిషోర్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన, రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠశాల సామగ్రి అందజేశారు.ఈ వేడుకల్లో వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పితాని బాలకృష్ణ, డిల్లీ నారాయణ, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి వల్లభుని దొరబాబు, నీటి సంఘ అధ్యక్షులు సరిపెల్ల శ్రీను రాజు, సీనియర్ నాయకులు నడింపల్లి సూరిబాబు రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతా పండుగ వాతావరణం నెలకొంది. నాయకుల ప్రాంగణం మార్మోగింది.

🌐 Select Language:
📰 ePaper