వర్షాలు లేక పత్తి మొక్కలకు నీరు పోస్తున్న రైతులు
సబ్ టైటిల్: వర్షాకాలంలో తీవ్రమైన ఎండలు
జనం న్యూస్ జూలై 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని చండూరు గ్రామంలో పత్తి మొక్కలకు రైతులు నీరు పోస్తున్నారు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండలంలోని వాడిపోతున్న పచ్చని పంటలు వర్షాకాలం వర్షం లేదు పొలాల్లో పచ్చదనం లేదు అప్పుల ఊబీలో అన్నదాతలువర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటిన ఆశించిన స్థాయిలో వర్షాలు కల్వకపోవడంతో చిలిపిచేడి మండలంలోని పంటలు ఎండిపోతున్నాయి ప్రకృతి కర్ణ కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు పొలాల్లో మాత్రం పచ్చని ఆశలు ఎండిపోతున్నాయి మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకంతో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసి విత్తనాలు చల్లిన రైతులకు ఇప్పుడు నిరాశ మిగిలింది తొలి వర్షాలకు మొలకెత్తిన పంటలు నీటి పురతతో మాడిపోతుండగా మరికొన్నిచోట్ల విత్తనాలు అసలే మొలకెత్తలేదు దీంతో రైతులు వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు పెట్టుబడి పెడుతుండగా మరోవైపు పంట చేతికొస్తుందో లేదో అన్న భయం అన్నదాతను వెంటాడుతుంది వర్షాకాలం వర్షాభావం కారణంగా మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు ఇంకా విత్తనాలు వేయకుండా పొలాలను ఖాళీగా ఉంచారు ఆలస్యంగా వర్షాలు కురిసిన దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతుంది వ్యవసాయ పనులు దాదాపు నిలిచిపోవడంతో కూలీలకు ఉపాధి కరువైంది గ్రామాల్లో చెరువులు కుంటలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి సాగునీటికి ఆధారమైన గెలవనలు అడుగంటి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పశువులకు కూడా తాగునీటి కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది పశువులకు మేత సమస్య కూడా తీవ్రంగా ఉండబోతుంది పంటపై ఆశపెట్టుకొని అప్పులు చేసిన రైతులకు ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్న వెంటాడుతుంది పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి మొలకెత్తిన వర్షం లేక బకెట్లలో నీటిని నింపుకొని పత్తి మొక్కలకు నీరు పోస్తున్నారు ఈసారి పెట్టుబడి కూడా వస్తుందో రాదు అని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో వర్షాలు పడి పంటలు పండుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రైతులు కానీ వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వల్ల పత్తి మొక్కకు నీరు పోసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు రైతులు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్పందించి రైతులని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు