యువత సన్మార్గంలో నడవాలి.

July 15, 2026 | తెలంగాణ

బీబీపేట సర్పంచ్ ఉప్పల సాత్విక

జనం న్యూస్ జులై 15( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )బీబీపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోజున ఆర్ టి ఐ. మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం, ఆదేశాల మేరకు. యువత దారి ఎటువైపు అనే అంశంపై, అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, బీబీపేట సర్పంచ్ ఉప్పల సాత్విక, ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ సాత్విక, మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దు అని, చెడు మార్గాల వైపు వెళ్ళవద్దని, మంచి ప్రవర్తనతో, మంచి మార్గంలో నడుచుకుంటూ,చదువుకొంటూ భవిష్యత్తును బంగారు బాటలో తీర్చిదిద్దుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు. గ్రామ కార్యదర్శి గూడ రమేష్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని. సత్ప్రవర్తనతో నడుచుకొంటూ తమ ఆశయాలను సాధించుకోవచ్చని తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ కమిటీ, జిల్లా అడ్వైజర్, మండల అధ్యక్షులు. ఎం నాంపల్లి, మాట్లాడుతూ సహ చట్టం వల్ల సామాన్య ప్రజలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కావద్దని. నేటి సమాజంలో జరుగుతున్న, దురాలవాట్ల పట్ల నష్టపోతున్నటువంటి యువతరం యొక్క భవిష్యత్తులను, విద్యార్థిని విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలని, బీడీ.సిగరెట్. తంబాకు. మద్యపానం. పేకాట. గంజాయి, డ్రగ్స్ వంటి. దురాలవాట్లకు అలవాటైన వారి, జీవితాలు ఏ విధంగా, నాశనమైపోయాయన్న విషయాన్ని క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో, సర్పంచ్ సాత్విక, ఈవో రమేష్, ఆర్ టి ఐ. జిల్లా అడ్వైజర్, మండల అధ్యక్షులు. నాంపల్లి, మండల కార్యదర్శి పండ్ల హనుమంతు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్, శ్రీకాంత్, అధ్యాపక బృందం, నరేష్, పవన్,సురేందర్,విటల్,రామ్, లక్ష్మణ్ తో పాటు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper