శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో ఘనంగా పూజలు

July 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ;15 జూలై బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్: వై.రమేష్; సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ లోని శ్రీ మహా మైసమ్మ దేవాలయంలో బుధవారం ఘనంగా పూజలు నిర్వహించారు.16వ ఆషాడ మహోత్సవంలో భాగంగా దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి స్వస్తి పుణ్యా హవచనం, అంకురా రోహణం, అఖండ దీపారాధన అభిషేకం వంటి పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారికి అలంకారము,నైవేద్యం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మంటపారాధన,అమ్మవారికి శాకాంబరి అలంకారం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper