ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

July 6, 2026 | తెలంగాణ

ఇబ్రహీంపట్నం మండలంలోని 18 మంది లబ్ధిదారులకు రూ.6.14 లక్షల ఆర్థిక సాయం – ప్రజల గడప వద్దకే చేరిన ప్రభుత్వ సహాయం

జనం న్యూస్, జులై 6, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం:ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా అందజేశారు.మండలంలోని డబ్బా, వర్సకొండ, ములారాంపూర్, బర్తిపూర్, వేములకుర్తి, తిమ్మాపూర్, గొదూర్, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.6,14,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పెద్ద భరోసా అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.లబ్ధిదారులు తమ ఇంటి వద్దకే వచ్చి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper