ఈ రోజు ఉదయ్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శృతి ఓజా ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

August 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 14 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈ సమావేశంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయంపై చాలా సేపు సుదీర్ఘంగా ఫలప్రదంగా చర్చించాము.సమావేశంలో సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన అంశాలు పోలీస్ శాఖలో రిజర్వేషన్లు జారీ చేసిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో డెస్క్/ఆఫీస్ జాబ్స్ కమ్యూనికేషన్స్, అకౌంట్స్, రికార్డ్ రూమ్స్ గుర్తించి చట్టబద్ధమైన 4% రిజర్వేషన్ అమలు చేయాలి.21 దివ్యాంగ కేటగిరీలకు ప్రాతినిధ్యం చట్టం 2016 ప్రకారం రిక్రూట్‌మెంట్‌లలో ఉన్న 21 రకాల దివ్యాంగ కేటగిరీలన్నింటికీ 21 శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసే విధంగా రిజర్వేషన్లు కేటాయించాలి. అధికారుల స్పందన & సానుకూల నిర్ణయాలు: మన అసోసియేషన్ ప్రతిపాదనలను, చట్టపరమైన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన సెక్రటరీ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు. ఈ క్రింది హామీలను ఇచ్చారు హోం శాఖకు ప్రతిపాదనలు: పోలీస్ శాఖలో డెస్క్ పోస్టుల గుర్తింపు మరియు 21 కేటగిరీలకు రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మరియు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి దివ్యాంగ సంక్షేమ శాఖ తరఫున వెంటనే అధికారిక లేఖలు ప్రతిపాదనలు పంపుతామని స్పష్టం చేశారు.నష్టాన్ని వివరిస్తూ సీఎంఓ & సీఎస్ దృష్టికి: రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల దివ్యాంగులు ఎంతలా నష్టపోతున్నారో సమగ్రంగా వివరిస్తూ చీఫ్ సెక్రటరీ కి నివేదిక సమర్పిస్తామని తెలిపారు ఉదయ్ అసోసియేషన్ తెలంగాణ.

🌐 Select Language:
📰 ePaper