పేద ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలన సీఎం నాయకత్వంలో నెరవేరినది
జనం న్యూస్ 14 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలో పరిధిలో పెంచికల పాడు గ్రామం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.గట్టు మండలంలో పరిధిలో పెంచికల పాడు గ్రామానికి చెందిన కు మాల సుమిత్ర మాల రాజు మంజూరు కావడం జరిగినది నేడు ఇల్లు నిర్మాణం చేసుకొని నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కానుకను అందజేశారుఎమ్మెల్యే కి లబ్ధిదారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన లబ్ధిదారులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగింది. వాటికి తోడుగా లబ్ధిదారులు మరికొంత డబ్బులను తో ఇంటిని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకోవడం జరిగినది.గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత లో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. దాదాపుగా 2000 పైగా ఇండ్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న. త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేయాలి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి తో సాధ్యమైనది అని పేర్కొన్నారు.ప్రజలు ఎవరు కూడా ఆందోళన అపోహాలు పడాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టించుకుంటే డబ్బులు రావని అపోహాలు వద్దు ఇల్లు రానివారికి ఎవరు కూడా అపోహ పడవద్దండి. రెండో విడతలో త్వరలో కూడా అర్హులైన లబ్ధిదారులు కు మంజూరు ఏవిధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కి గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కి గద్వాల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూఎన్నో ఏళ్ళు గా మా సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఎల్లప్పుడూ సీఎం కి మంత్రి కి మా ఎమ్మెల్యే కి రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ జిల్లా సర్పంచులు అధ్యక్షులు రాజశేఖర్ సీనియర్ రామకృష్ణ రెడ్డి సర్పంచ్ నాయకులు హనుమంత్ రెడ్డి నరేందర్ రెడ్డి సంతోష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు