ఉదయ్ అసోసియేషన్ సాధించిన మహా విజయం
జనం న్యూస్ 01 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల కలెక్టరేట్ ముట్టడి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ని మన ఉదయ్ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులం కలిసి దివ్యాంగుల ప్రధాన సమస్యలపై వినతిపత్రాలు సమర్పించాము. మన డిమాండ్లపై కలెక్టర్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ విప్లవాత్మకమైన హామీలు ఇచ్చారు.కలెక్టర్ ముఖ్యమైన హామీలుఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ దివ్యాంగుల రెజ్యూమేలను స్వయంగా స్వీకరించి జిల్లాలో రాబోయే కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో దివ్యాంగులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని మాట ఇచ్చారు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: చట్ట ప్రకారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ తూచా తప్పకుండా కల్పిస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీ పోస్టులు రాబోయే భారీ అంగన్‌వాడీ నోటిఫికేషన్‌లో కూడా దివ్యాంగ మహిళలకు మొదటి ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు మన హక్కుల కోసం వెనకడుగు వేయకుండా పోరాడితే ఏదైనా సాధ్యమని ఈరోజు మరోసారి రుజువైంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఉదయ్ టీమ్ సభ్యులకు, దివ్యాంగ సోదర సోదరీమణులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.జోగులాంబ గద్వాల జిల్లాఉదయ్ అసోసియేషన్