ఎంపీ హరీష్ కృషితో మత్స్యకారులు సురక్షితం
అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి చొరవతో పశ్చిమ బెంగాల్ నుంచి ఏడుగురు మత్స్యకారుల సురక్షిత
జనం న్యూస్ ఆగస్టు 27 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల సురక్షిత రాక కోసం అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం. హరీష్ బాలయోగి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే, పశ్చిమ బెంగాల్ మెరైన్ డీఐజీ తో పాటు అక్కడి ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ, మత్స్యకారులను సురక్షితంగా పశ్చిమ బెంగాల్ నుంచి స్వస్థలమైన అమలాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు
ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ నుంచి అమలాపురం వైపు బయలుదేరారు. వారి ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నేరుగా స్వగ్రామాలకు చేరుకునేందుకు అమలాపురం ఎంపీ జి.ఎం.హరీష్ బాలయోగి ప్రత్యేకంగా టెంపో ట్రావెలర్ వాహనాన్ని ఏర్పాటు చేశారుమత్స్యకారులు తమ కుటుంబ సభ్యుల వద్దకు క్షేమంగా చేరుకునే వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి స్వయంగా పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో సంబంధిత అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారుఈ సందర్భంగా మత్స్యకారుల సురక్షిత రాక కోసం సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్ అధికారులు మరియు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు