పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లతో భరోసా-ముత్యాల సునీల్ కుమార్
జనం న్యూస్ ఆగస్టు 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బ ట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సయ్యద్ ఆశాబీ, సయ్యద్ భాష, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.