కంకల్ – చిట్టింపల్లి – లాల్ పహాడ్ R&B రోడ్డు గోస విని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సంబందిత R&B శాఖామంత్రి మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తానని హమీ ఇచ్చిన MP
జనం న్యూస్ 27 ఆగస్టు :- వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ – అంగడి చిట్టెంపల్లి – లాల్పహాడ్ R&B రోడ్డు వేయాలని కోరుతూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలోని రోడ్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రి గారితో ఈ రోడ్డు గురించి మాట్లాడతానని, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పది రోజుల లోపల ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మళ్లీ నన్ను కలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా IT In-charge రవీందర్ కంకల్ , ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ , శ్రీశైలం కలవడం జరిగింది.