ఐజ పట్టణ పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన ప్రజా సంఘ నాయకులు
జనం న్యూస్ 26 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో విద్య వైద్యం సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వారిలో అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ కి ప్రజా సంఘ నాయకులు వినతి పత్రం ఇచ్చారు ఐజ పట్టణంలోని ప్రధాన సమస్యలను గత నాలుగు నెలల క్రితం గత కలెక్టర్ సంతోష్ దృష్టికి ఎమ్మెల్యే విజయుడు దృష్టికి ఎంపి డాక్టర్ మల్లు రవి దృష్టికి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లాం అయినా కూడా నేటి వరకు ఆచరణలో వెనుకబడి ఉన్నదని మేము భావిస్తున్నాం కనుక దయచేసి ఐజ పట్టణంలోని ప్రధాన సమస్యలపై ముఖ్యంగా విద్యా వైద్యం గురించి మళ్లీ ఒకసారి ఆలోచన చేసి సత్వరమే సమస్యలను పరిష్కరించవలసిందిగా మళ్లీ మీ దృష్టికి తీసుకు వస్తున్నాం కనుక దయచేసి ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే సమస్యలు కాబట్టి సత్వరమే పరిష్కరిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం సమస్యలు:-ఐజ ఎస్సీ హాస్టల్ లోని మైనర్ రిపేర్లు చేయించుట ఐజ పట్టణంలో 30 పడకల ఆసుపత్రిని సత్వరమే ప్రారంభించుట ఐజ పట్టణంలో మాదిగ వాడలో ఉన్న బస్తీ దావాఖాన వెంటనే ప్రారంభించుట మాదిగ వాడలో ఉన్న స్కూల్ గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎన్నిక కాబడింది అయినా కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఇవేకాక జోగులాంబ గద్వాల జిల్లాలో అనేక మండల కేంద్రాల్లో హాస్టల్స్ హాస్పిటల్స్ లో చాలా సమస్యలు ఉన్నాయి కనుక దయచేసి పై సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు దండోరా ఆంజనేయులు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్ పాల్గొన్నారు