కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
జనం న్యూస్ జున్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అనేకమంది ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేని వన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మారేపల్లి రవీందర్ చిందం రవి ఎండి హైదర్ నిమ్మల రమేష్ రవిపాల్ లడే రాజ్ కుమార్ మామిడిపల్లి సాంబయ్య వరదరాజు మార్కండేయ రఫీ ప్రపంచ రెడ్డి కటయ్య వీరన్న సుధాకర్ తదితరులు పాల్గొన్నారు……