కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా నితీష్ చంద్ర గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా.
జనం న్యూస్ జులై 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా నితీష్ చంద్ర గౌడ్ జన్మదిన వేడుకలను కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ రంగా నితీష్ చంద్ర గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వినోద్ బాబు, సాయిబాబా చౌదరి, శ్రీనివాస్ బాబు, మస్తాన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, కామినేని వాసు, గోపాల్ చౌదరి, జగదీష్, ప్రకాష్ ముదిరాజ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని రంగా నితీష్ చంద్ర గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.