గుంటూరు జిల్లా బిజెపి ఇంఛార్జి యాళ్ల దొరబాబుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సన్మానం

July 10, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) బిజెపి గుంటూరు జిల్లా ఇంఛార్జిగా నియమితులైన యాళ్ల దొరబాబును ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొనం సత్యవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధంపల్ల రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ పాల్గొని యాళ్ల దొరబాబును శాలువా, పూలమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, యాళ్ల దొరబాబు నియామకం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మండేల నాగవెంకటప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకటసుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా చిట్టిబాబు, చింతలపూడి సత్తిబాబు, కొమ్ముల సురేష్, అత్తిలి వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లా చిట్టిబాబు, నమిన వీరబాబు, వీరమూర్తి, సాధనల రాంబాబు, జనసేన సీనియర్ నాయకులు సుధ, చిన్న మహాదశ, నాగేశ్వరరావు, అమలాపురం డ్రగ్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ప్రసాద్, బిల్డర్ చిక్కం ప్రసాద్, చిక్కాల రవికాంత్, మండేల తేజ, చిక్కాల మొద్దుబాబు, ప్రముఖ కాంట్రాక్టర్ అల్లాడ వెంకటరమణ, బిజెపి సీనియర్ నాయకులు మేకల చంటి తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper