బిఆర్ఎస్వి చైతన్య సదస్సు వాల్ పోస్టర్లు విడుదల చేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
జనం న్యూస్ జూలై 20, వికారాబాద్ జిల్లా (పరిగి నియోజకవర్గం ఇంచార్జి ) పరిగి పట్టణం తెలంగాణ రాష్టంలో విద్యరంగనికి తీవ్ర నష్టం జరుగుతుంది అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రాష్ట్రనికి ఇప్పటి వరకు విద్య శాఖ మంత్రి లేకపోవడం, కాంగ్రెస్ పాలనకు సిగ్గు చేటు అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బి ఆర్ ఎస్ వి చైతన్య సదస్సు ఈ నెల 22 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ఆడిటోరియం జరగనున్న బి ఆర్ ఎస్ వి చైతన్య సదస్సు కార్యక్రమన్ని విజయవంతం చేయాలనీ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు తెలిపారు.