కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల పని చేయాలి మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి*
జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ఎస్సీ సెల్ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అర్హులైన నిరుపేదలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషించాలన్నారు అనంతరం ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా మారేపల్లి కట్టయ్య ఉపాధ్యక్షుడిగా కోకిల జగన్ ప్రధాన కార్యదర్శిగా ఆరె కమలాకర్ ఇతర కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు దుబాసి కృష్ణమూర్తి వైనాల కుమారస్వామి శానం కుమారస్వామి మామిడిపల్లి సాంబయ్య ప్రేమ్ సాగర్ సుకుమార్ శ్రీనివాస్ సాదయ్య బానోతు సుమన్ మారపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు….