కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా కంటే ప్రమాదకరం

June 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 22 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా రైతుల‌ను ఆదుకోవ‌డంలో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం విఫ‌లం మీడియా సమావేశం నిర్వహించిన మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఆదేశాల మేరకు మల్దకల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్దకల్ మండల్ నాయకులు డి. శేఖర్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో గొప్ప హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రైతులను తీవ్రంగా నిరాశపరిచిందని మండిపడ్డారు.సమైక్య పాలనలో రైతులు ఆగమయ్యారని,నాడు ఎరువులు, విత్తనాలు, కరెంటు కోతలతో ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడేవారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేదని విధంగా రైతుబంధు బీమా రుణమాఫీ 24 గంటల ఉచిత కరెంటు సాగు నీటి ప్రాజెక్టులు మిషన్ కాకతీయ వంటి సంక్షేమ కార్యక్రమాలతో రైతును రాజును చేశారన్నారు మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రస్తుతం అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులను మోసం చేసింద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలు సక్రమంగా కొనలేదని బోనస్ బోగస్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులను గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని, వెళ్తే ఉరికించి కొడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని,ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అనేక ప్రాజెక్టులు నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper