కేలో ఇండియా డైలాగ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
జనం న్యూస్ ఆగస్టు 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్పల్లిలో జాతీయ సేవా పథకం మరియు క్రీడా విభాగం ఆధ్వర్యంలో “కేలో ఇండియా డైలాగ్స్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో క్రీడల ప్రాముఖ్యతపై నిర్వహించిన వర్చువల్ సంభాషణను కళాశాల విద్యార్థులు వీక్షించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైక్లింగ్ క్రీడలో అనేక పతకాలు సాధించిన సాయి చరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సైక్లింగ్లో తాను సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలు మరియు విద్యార్థుల జీవితంలో క్రీడల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా సాయి చరణ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో క్రీడలకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చందన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైక్లింగ్ క్రీడాకారుడు సాయి చరణ్ యాదవ్ ని కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కరుణాకర్, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ నాగుల వేణు, డాక్టర్ పద్మ, క్రీడల విభాగాధిపతి మహమ్మద్ జలీల్, ఏ. గోపాల్, ప్రవీణ్ కుమార్, మై భారత్ కార్యకర్తలు కుమార్, శ్రీధర్, జాతీయ సేవా పథకం వాలంటీర్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.