గర్భవతులకు వైద్య పరీక్షలు

July 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పి ఎం యస్ ఎమ్ ఏ కార్యక్రమం పురస్కరించుకొని 30 మంది గర్భవతులకు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ తీయడం జరిగినది అని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కె. శరత్ కమల్ తెలిపారు . ప్రతి నెల రాజంపేటలోని ప్రముఖ గైనకాలాజిస్ట్ డాక్టర్ మస్తానమ్మ స్వచ్చందముగా నంద లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు స్కానింగ్ చేస్తారు. ఈ రోజు గర్భవతులకు డాక్టర్ మస్తానమ్మ ఆహారం కూడా సప్లై చేయడం జరిగింది. కావున డాక్టర్ మస్తానమ్మ కి డాక్టర్ శరత్ కమల్ మరియు డాక్టర్ డి. కార్తీక్ విశ్వనాధ్ గర్భవతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్య క్రమం లో సి హెచ్ ఓ వెంకట నారాయణ, పి హెచ్ ఎన్ శైలజ,సూపర్ వైజర్లు హిమ శంకరి, సునీల్, హెల్త్ అసిస్టెంట్ మధు,ఎం ఎల్ హెచ్ పిలు, ఏ ఎన్ ఎమ్స్, ఆశాకార్యర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper