గుర్రాలగొంది ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సత్కారం

May 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్; 15 మే శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;పదవ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు గుర్రాలగొంది ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సత్కారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివిపించి, ఉన్నత విద్యను అందేలా కృషి చేయాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సత్కారం చేసి, 60 సంవత్సరాల క్రితం ఏర్పడిన పాఠశాల రాబోయే రోజుల్లో మరింతగా విద్యను అందిస్తుందన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కోలరాజు, ఉండ్రాళ్ల తిరుపతి, గోపాలపురం శంకర్, సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్, ప్రధానోపాధ్యాయులు మొలుగు బాల్ రాజ్, డాక్టర్ నిహర్, బాలసాహితీవెత్త ఉండ్రాళ్ళ రాజేశం, సురగొని లింగయ్య, ఆకుల హరిదాస్, గోపాలపురం వెంకటేశం, సురగొని రాములు, బెజగామ శివయ్య, దుబ్బాక తిరుపతి, సి ఆర్ పి మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper