చండూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన గ్రామ సర్పంచ్ శేషాద్రి
సబ్ టైటిల్: తడి పొడి చెత్తను వేరు చేయాలి పంచాయతీ కార్యదర్శి తిరుపతి
జనం న్యూస్ జూన్ 9 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తడి పొడి చెత్తను వేరు చేస్తూ ఇళ్ల చుట్టూ పారిశుద్ధ్యం వాన కాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ ఓ తాజుద్దీన్ అలాగే చండూర్ భద్రతాండ సర్పంచులు చండూర్ గ్రామ సర్పంచ్ శేషాద్రి బద్రీనాథ్ సర్పంచ్ పుణ్యా నాయక్ మాట్లాడుతూ సోమవారం చండూరు భద్రతాండాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభలు ఏర్పాటు చేశారు వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు పాలకవర్గంలో నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషాద్రి గ్రామపంచాయతీ సెక్రటరీ తిరుపతి ఉప సర్పంచ్ వెంకటేశం మౌనిక గణేష్ నాయక్ ఏ ఈ ఓ కృష్ణవేణి మోహన్ వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు