దివ్యాంగుల యస్ ఆర్ డి ఎక్స్‌టెన్షన్ జీవో మరియు బ్యాక్‌లాగ్ పరికరాలను త్వరగా విడుదల చేయాలి డైరెక్టర్ శైలజ కి ఉదయ్ అసోసియేషన్ వినతి*

June 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 09 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ శైలజ ని మర్యాదపూర్వకంగా కలిసి సమగ్ర వినతిపత్రం అందజేయడం జరిగిందిఈ సందర్భంగా ఉదయ్ అసోసియేషన్ ప్రతినిధులు డైరెక్టర్ దృష్టికి ముఖ్యమైన డిమాండ్లను తీసుకెళ్లారు యస్ ఆర్ డి ఎక్స్‌టెన్షన్ జీవో దివ్యాంగుల ప్రత్యేక నియామకాలకు సంబంధించిన యస్ ఆర్ డి స్పెషల్ రిక్వెస్ట్ డ్రైవింగ్ గడువు పొడిగింపు జీవోను వెంటనే విడుదల చేయాలి.దివ్యాంగుల పరికరాల పంపిణీ: జిల్లాలలో అర్హులైన దివ్యాంగులకు అందాల్సిన సహాయక పరికరాలను (ట్రై సైకిళ్లు వీల్ చైర్స్ హియరింగ్ ఎయిడ్స్ మొదలైనవి) ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పంపిణీ చేయాలి ఈ కార్యక్రమంలో ఉదయ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. శ్రీనివాసులు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కుమార్ మల్లు, మరియు గద్వాల్ జిల్లా అధ్యక్షుడు కొండయ్యా పాల్గొన్నారు.ఉదయ్ అసోసియేషన్.

🌐 Select Language:
📰 ePaper