చేనేత కార్మికుని కుటుంబాన్ని కి 5 లక్షల బీమా
జనం న్యూస్ ఆగస్టు 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన బాసని సాంబయ్య అను చేనేత కార్మికుడు గత కొద్ది నెలల క్రితం అనారోగ్య కారణాలతో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించే చేనేత భీమా పథకంలో భాగంగా అతని కుటుంబానికి రూ. 5,00,000/- లను తన భార్య బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనితో మృతుని భార్య అయినటువంటి బాసని సునిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులకు, తెలంగాణ మినిమం వేజేస్ బోర్డు మెంబర్ బాసని చంద్రప్రకాష్ శాయంపేట చేనేత సహకార సంఘ పాలక వర్గానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు…