మేడికొండ రోడ్డుకు మోక్షం ఎప్పుడు అంటున్న ప్రజలు.
జనం న్యూస్ 14 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండ రోడ్డు గత 17 సంవత్సరాల నుండి ఇప్పటివరకు పూర్తికాని రోడ్డు ఇప్పటివరకు ఎందరినో ప్రాణాలు కోల్పోయినవి. అదేవిధంగా వందల యాక్సిడెంట్లు జరిగినవి కానీ ఇప్పటికీ రోడ్డు అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇంకా ఎప్పటి వరకు ఈ రోడ్డు పూర్తవుతుందో అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అయితే మున్సిపాలిటీకి సంబంధించిన పోలోను వాగు బ్రిడ్జి కూడా మధ్యలో ఆపడం జరిగింది. ఇది అంతర్ రాష్ట్ర రహదారి కాబట్టి కొన్ని లక్షల మంది. ఈ రోడ్డు వెంట తిరుగుతూ ఉంటారు 24 గంటలు రద్దీగా ఉంటున్న రోడ్డు రాత్రి అయితే రోడ్డు కంటికి కూడా కనపడని దుస్థితి ఉంది. దీనికి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని బ్రిడ్జి మరియు రోడ్డును పూర్తి చేయాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. కావున అతి త్వరలో బ్రిడ్జిని పూర్తి చేస్తే మరియు రోడ్డును కూడా సకాలం లో పూర్తి చేస్తే బాగుంటుంది. లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అందరి తో కలసి వచ్చి పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు ధర్నాకు దిగటానికైనా సిద్ధమే అంటున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్ తెలియజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు మీడియా ఇన్ఛార్జి యు రాముడు, సురేందర్ గౌడ్ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.