జహీరాబాద్‌లో ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన.
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జహీరాబాద్, జూన్ 3: మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ యూనుస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బస్టాండ్ తదితర బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, అటవీ శాఖ అధికారులు, స్థానిక సీఐ, ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులు, కౌన్సిలర్ సోని ఇర్మియా, మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జి మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను విడనాడి, పర్యావరణానికి హాని చేయని ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత జహీరాబాద్‌గా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు