జహీరాబాద్ లో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

June 3, 2026 | తెలంగాణ

జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ కార్యకర్తల్లో పండుగ వాతావరణం తలపించేలా జరుపుకున్నాం

జనం న్యూస్ తేదీ 03-06-2026 . జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఆధ్వర్యంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,ఝరసంఘం మండల అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ పట్టణం మున్సిపల్ కౌన్సిలర్ లు నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఝరసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమం , పట్టణంలోని దర్గా , మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జన హృదయ నేత,అందరి ఆత్మీయ నాయకులు, ప్రజలు మెచ్చిన నేత, ప్రజల కోసం కష్టపడే మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని , సర్వమత ప్రార్థనలను నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు.హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరారు. ప్రజల కోసం జీవిస్తూ.. ప్రజల కోసమే పరిపాలన చేస్తాం. రాబోయే కాలంలో గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తాం. మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల తరఫున పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని అన్నారు

🌐 Select Language:
📰 ePaper