టీ వై జె ఎఫ్ ,ప్రభాకర్ జన్మదిన వేడుకలుజహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
జనం న్యూస్ 18 -08-2026 ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ తెలంగాణ యువ జర్నలిస్టుల ఫౌండేషన్ (TYJF) అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లు అందజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జర్నలిస్టులు ప్రజలకు మరింత చేరువ కావాలని వారు అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్, అడ్వకేట్ మాణిక్ పటేల్,tyjf జహీరాబాద్ నియోజకవర్గం ప్రెసిడెంట్ జానారెడ్డి మరియు మరియు జహీరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ , వైస్ ప్రెసిడెంట్ వీరేశం, జర్నలిస్టుల బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.