సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలుఘనంగా నివాళులు

August 18, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) బీజేపీ, ఓబీసీ మోర్చా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా​కామనగరువు గ్రామంలో బహుజన వీరుడు, విప్లవ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌడ ప్రముఖులు, మాజీ సర్పంచ్ భీమన్న గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు ఆధ్వర్యంలో
​కార్యక్రమంలో భాగంగా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం, అణచివేతపై పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను, పోరాట పటిమను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ​అనంతరం గౌడ నాయకులు, మాజీ సర్పంచ్ భీమన్న గారిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా వారు దుశ్శాలువాతో, పూలదండలతో ఘనంగా సత్కరించారు.​పాల్గొన్న ముఖ్య నాయకులు:ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడవల్లి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం నరసింహ శెట్టి, జిల్లా సంచార జాతుల కన్వీనర్ వీర్నాల రమణబాబు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సానబోయిన సత్యనారాయణ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సహారా బేగం, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొండేటి జయలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు మిద్దె సత్య పురుషోత్తం, బొర్రా ఆంజనేయులు, బొక్క రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు పావులూరు వెంకట్, రూరల్ అధ్యక్షుడు సమాస ఏడుకొండలు, కట్ట రామకృష్ణతో పాటు స్థానిక నాయ

🌐 Select Language:
📰 ePaper